Breaking News

సెంచరీతో ముంబైని గెలిపించిన గ్రీన్‌

Published on Sun, 05/21/2023 - 19:22

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ సెంచరీతో మెరిశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గ్రీన్‌ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్‌ గెలిపించడంతో పాటు తొలి ఐపీఎల్‌ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 47  బంతుల్లో శతకం మార్క్‌ అందుకున్న కామెరాన్‌ గ్రీన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయంతో ముంబై ఇండియన్స్‌ 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ రేసులో ఉన్నప్పటికి.. ఆర్‌సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్‌ రద్దు అయితే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున కామెరాన్‌ గ్రీన్‌ది రెండో సెంచరీ కాగా తొలి సెంచరీ సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్‌ తరపున గ్రీన్‌ది ఆరో శతకం. ఇంతకముందు సనత్‌ జయసూర్య, సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ, లెండిల్‌ సిమన్స్‌, సూర్యకుమార్‌ ఉండగా.. తాజాగా వీరి సరసన కామెరాన్‌ గ్రీన్‌ నిలిచాడు.

ఇక ఐపీఎల్‌ 2023లో గ్రీన్‌ది తొమ్మిదో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ 100   పరుగులు, శుభమాన్ గిల్ (101  పరుగులు), ప్రభసిమ్రాన్ సింగ్ (103  పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు)  , యశస్వి జైస్వాల్ (124  పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు)తో ఉన్నారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)