హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్
Breaking News
BWF Rankings: ఎనిమిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం
Published on Wed, 12/28/2022 - 09:19
World Badminton Rankings 2022: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కొంత కాలంగా చక్కటి ఫామ్‌లో ఉన్న ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు.
ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది.
ఇది కూడా చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు
ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఇరిగేశి అర్జున్ మంగళవారం జరిగిన నాలుగు రౌండ్లలో రెండు గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్లో ఓటమి పాలయ్యాడు. 9 రౌండ్లు ముగిసిన అనంతరం అర్జున్ 6.5 పాయింట్లతో మరో ఆరుగురి తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల ర్యాపిడ్ చెస్‌లో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి భారత క్రీడాకారిణి సవితశ్రీ (6.5) మరో ఇద్దరితో కలిసి ఆధిక్యంలో ఉంది.
Tags : 1