Breaking News

BWF Championships: సింధుకు క్లిష్టమైన డ్రా.. ఆ రెండు అడ్డంకులు దాటితేనే

Published on Fri, 08/11/2023 - 09:13

కౌలాలంపూర్‌: ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్‌ పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ కార్యక్రమం గురువారం జరిగింది. మహిళల సింగిల్స్‌లో భారత్‌ నుంచి సింధు మాత్రమే బరిలో ఉంది. 16వ సీడ్‌గా బరిలోకి దిగనున్న సింధుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.

ఆ తర్వాత సింధుకు ప్రతి రౌండ్‌లో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. రెండో రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సింధు ఆడే చాన్స్‌ ఉంది. మూడో రౌండ్‌లో మరో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) సిద్ధంగా ఉండవచ్చు.

ఈ రెండు అడ్డంకులు దాటితే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సెయంగ్‌ (దక్షిణ కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. ఆన్‌ సెయంగ్‌తో ఇప్పటి వరకు సింధు ఆరుసార్లు ఆడగా ఆరుసార్లూ ఓడిపోయింది.

ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్‌ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీకి... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.    

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)