Breaking News

‘ధర్మశాల’ అవుట్‌ ఫీల్డ్‌పై బట్లర్‌ అసంతృప్తి 

Published on Tue, 10/10/2023 - 03:55

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. అయితే ఇంగ్లండ్‌ సారథి బట్లర్‌ ధర్మశాల స్టేడియంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మైదానం పేలవంగా ఉంది. అవుట్‌ఫీల్డ్‌ ఆటగాళ్లకు ప్రమాదకరం. క్యాచ్‌లు పట్టేటపుడు, డైవింగ్‌ చేసేటపుడు ఫీల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరుగు ఆపేందుకు డైవ్‌ చేస్తే గాయాల బారిన పడొచ్చు.

ఐపీఎల్‌లో ఆడినప్పటిలా ఈ అవుట్‌ఫీల్డ్‌ లేదు. ఇది క్రికెటర్లకు ఇబ్బందికరం’ అని బట్లర్‌ అన్నాడు. బౌలర్లకు ప్రత్యేకించి పేసర్లు రనప్‌ ఏరియాను ఓ కంట కనిపెడుతూనే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వేదికపై అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో పదేపదే జారి పడ్డారు. దీంతో అఫ్గాన్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ అవుట్‌ఫీల్డ్‌ చెత్తగా ఉందన్నాడు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)