Breaking News

భారత ఆర్చరీ జట్టుకు కాంస్యం

Published on Thu, 04/10/2025 - 03:51

ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ ఆర్చరీ కొత్త సీజన్‌ను భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకంతో ప్రారంభించింది. ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, రిషభ్‌ యాదవ్, ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలేలతో కూడిన భారత జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్, రిషభ్, ఓజస్‌ త్రయం 230–224 పాయింట్ల తేడాతో మథియాస్‌ ఫులర్టన్, రస్‌ముస్‌ బ్రామ్‌సెన్, మార్టిన్‌ డామ్స్‌బోలతో కూడిన డెన్మార్క్‌ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో 219–219 (27–29) స్కోరుతో ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.  

జ్యోతి సురేఖ మాత్రమే... 
మరోవైపు మహిళల కాంపౌండ్‌ విభాగంలో భారత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ మాత్రమే ఈ టోర్నీలో ఆడుతోంది. ఇతర భారత క్రీడాకారిణులకు వీసా రాకపోవడంతో టీమ్‌ విభాగంలో భారత్‌ పతకావకాశాలు దెబ్బతిన్నాయి. క్వాలిఫయింగ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ 691 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచింది. తొలి రౌండ్‌లో చిలీకి చెందిన ఒలియా ప్రాడోతో జ్యోతి సురేఖ ఆడుతుంది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో రిషభ్‌ యాదవ్‌–జ్యోతి సురేఖ జోడీ పోటీపడుతుంది.

లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఈవెంట్‌ 
2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీ క్రీడాంశంలో కొత్తగా కాంపౌండ్‌ ఈవెంట్‌ను జత చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఆర్చరీ క్రీడాంశంలో రికర్వ్‌ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్‌ విభాగంలో ఐదు ఈవెంట్స్‌లో (పురుషుల, మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్‌) పతకాలు అందజేస్తున్నారు.

 తాజాగా లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ను కొత్తగా మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టనున్నారని వరల్డ్‌ ఆర్చరీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాంపౌండ్‌ ఈవెంట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడంతో ఈ విభాగంలో భారత స్టార్స్‌ జ్యోతి సురేఖ, అభిషేక్‌ వర్మల నుంచి ఒలింపిక్‌ పతకాన్ని ఆశించవచ్చు.  

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)