అల్‌కరాజ్‌కు చుక్కెదురు

Published on Mon, 03/17/2025 - 03:18

కాలిఫోర్నియా: ‘హ్యాట్రిక్‌’ సాధించాలనే లక్ష్యంతో ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌కు నిరాశ ఎదురైంది. గత రెండేళ్లు చాంపియన్‌గా నిలిచిన అల్‌కరాజ్‌ ఈసారి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 14వ ర్యాంకర్, బ్రిటన్‌ ప్లేయర్‌ జేక్‌ డ్రేపర్‌ అద్భుత ఆటతీరుతో అల్‌కరాజ్‌ ఆట కట్టించి తన కెరీర్‌లో తొలిసారి మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్లో 13వ సీడ్‌ డ్రేపర్‌ 6–1, 0–6, 6–4తో రెండో సీడ్‌ అల్‌కరాజ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో డ్రేపర్‌ తొలిసారి టాప్‌–10లోకి దూసుకురానున్నాడు. 23 ఏళ్ల డ్రేపర్‌ గత ఏడాది వియన్నా ఓపెన్, స్టుట్‌గార్ట్‌ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు. 

ఫైనల్లో 12వ సీడ్‌ హోల్గర్‌ రూనే (డెన్మార్క్‌)తో డ్రేపర్‌ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ రూనే 7–5, 6–4తో ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచాడు. అల్‌కరాజ్‌తో ఐదోసారి తలపడ్డ డ్రేపర్‌ ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డ్రేపర్‌ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. మరోవైపు అల్‌కరాజ్‌ 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)