Breaking News

విషాదం.. గుండెపోటుతో కన్నుమూసిన బ్రెజిల్‌ ఆటగాడు

Published on Tue, 08/04/2026 - 13:46

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ క్రీడ‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఫ్లైవెయిట్ యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో (34) గుండెపోటుతో క‌న్నుమూశాడు. సోమ‌వారం ఉద‌యం నిద్ర‌లోనే అల‌న్ నాసిమెంటో తుదిశ్వాస విడిచిన‌ట్లు యూఎఫ్‌సీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 2021లో యూఎఫ్‌సీ ఫైట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన నాసిమెంటో రికార్డు ఆక్టాగ‌న్ ఫైట్ విభాగంలో 4-2గా ఉంది. 

జూన్‌లో త‌న చివ‌రి యూఎఫ్‌సీ ఫైట్‌లో పాల్గొన్న నాసిమెంటోకు సోమ‌వారం ఉద‌యం నిద్రలోనే గుండె పోటు వ‌చ్చింది. దీంతో అత‌డి కుటుంబ‌స‌భ్యులు స‌మాచారం ఇవ్వ‌డంతో అత్య‌వ‌స‌ర సిబ్బంది నాసిమెంటో ఇంటికి వ‌చ్చి సీపీఆర్ చేశారు. కానీ అప్ప‌టికే అత‌డి ప్రాణం పోయిన‌ట్లు తెలుస్తోంది. ఇక ప్రొఫెష‌న‌ల్ మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) కెరీర్‌లో ఫైట‌ర్‌గా 22 విజ‌యాలు, ఏడు ప‌రాజ‌యాలు చ‌విచూశాడు. 

కోచ్ డియెగో లిమా వద్ద శిక్షణ పొందుతూ, నాసిమెంటో..మాజీ యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఛాంపియన్ చార్లెస్ ఒలివెరా, యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఎల్వెస్ బ్రెనర్‌తో సహా పలువురు అగ్రశ్రేణి బ్రెజిలియన్ ఫైటర్లతో తలపడ్డాడు. మరోవైపు యూఎఫ్‌సీ కూడా అల‌న్ నాసిమెంటో చేసిన ఎంఎంఏ ఫైట‌ర్‌గా సాధించిన విజ‌యాల‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అల‌న్ నాసిమెంటో ఒక నైపుణ్యం ఉన్న పోటీదారుడు, ప‌రిపూర్ణ ఎంఎంఏ ఫైట‌ర్ అని కొనియాడింది.

Read: ధోని కనుసన్నల్లో ట్రైనింగ్‌.. లంకను కుమ్మేస్తాడా?

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)