Breaking News

‘సిక్సర్‌’ కొట్టేనా!

Published on Sun, 06/07/2026 - 04:03

ఫుట్‌బాల్‌ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు వరల్డ్‌కప్‌ గెలిచిన బ్రెజిల్‌ జట్టు... ఆరోసారి ట్రోపీ కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఖతార్‌ వేదికగా 2022లో జరిగిన ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో పోరాడి ఓడిన బ్రెజిల్‌... ఈ సారి ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా కప్పును ముద్దాడాలని భావిస్తోంది. 

1958, 1962, 1970, 1994, 2002 ఇలా ఐదు పర్యాయాలు వరల్డ్‌కప్‌ గెలిచిన బ్రెజిల్‌ గత కొంతకాలంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఒకప్పటిలాగా భారీ అంచనాలు లేకపోవడం కూడా బ్రెజిల్‌ జట్టుకు కలిసిరానుంది. ‘ఫిఫా’ ప్రపంచకప్‌ చరిత్రలో జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు విశ్వవిజేతలుగా నిలవగా... సాకర్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ పీలే ఒక్కడే బ్రెజిల్‌కు మూడుసార్లు ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం ఆ స్థాయి ఆటగాళ్లు లేకపోయినా... నెమార్‌ జూనియర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. 

ఈ ప్రపంచకప్‌ కోసం బ్రెజిల్‌ 26 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు డిఫెండర్‌ మార్కినోస్‌ కెప్టెన్‌ కాగా... 34 ఏళ్ల నెమార్‌ జూనియర్‌ దాదాపు తన చివరి వరల్డ్‌కప్‌ ఆడనున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు నెమార్‌ గాయంతో ఇబ్బంది పడుతున్నా... బ్రెజిల్‌ జట్టు మేనేజర్‌ కార్లో ఆన్సెలొటి మాత్రం అతడిపై నమ్మకం ఉంచాడు. తనదైన రోజున క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల నెమార్‌ జట్టుకు బలమని ఆన్సెలొటి వెల్లడించాడు.  

గ్రూప్‌–‘సి’ నుంచి బరిలోకి దిగనున్న బ్రెజిల్‌కు ప్రధానంగా మొరాకో నుంచి ముప్పు పొంచి ఉంది. గత టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన మొరాకో ఈ సారి కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. అలాగే స్కాట్లాండ్, హైతీ కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని తపిస్తున్నాయి. గ్రూప్‌ దశలో జూన్‌ 14న మొరాకోతో తొలి మ్యాచ్‌ ఆడనున్న బ్రెజిల్‌... ఆ తర్వాత 20న హైతీతో, 25న స్కాట్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్‌ దశ దాటడం పెద్ద కష్టం కాకపోయినా... నాకౌట్‌లో బ్రెజిల్‌ జట్టుకు అసలుసిసలు పోటీ ఎదురుకానుంది.           – సాక్షి, క్రీడావిభాగం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)