Breaking News

ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌పై దృష్టి

Published on Wed, 09/25/2024 - 04:58

చెన్నై: చెస్‌ ఒలింపియాడ్‌ స్ఫూర్తితో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ చెప్పాడు. నవంబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. డిఫెండింగ్‌ చాంపియన్, చైనీస్‌ గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో భారత ఆటగాడు ప్రపంచ చాంపియన్‌గుకేశ్‌ ప్‌ టైటిల్‌ కోసం తలపడతాడు. ఈ టోరీ్నకి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఫామ్‌ను కాపాడుకునేందుకు... ఎత్తుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పాడు. 

నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 15 వరకు సింగపూర్‌లో గుకేశ్, లిరెన్‌ల మధ్య ప్రపంచ పోరు జరుగుతుంది. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ గెలుపొందడం ద్వారా ఈ మెగా టోరీ్నకి గుకేశ్‌ అర్హత సంపాదించాడు. 18 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌ చాలెంజర్‌ హంగేరిలో ముగిసిన చెస్‌ ఒలింపియాడ్‌లో కీలక పాత్ర పోషించాడు. 

ముఖ్యంగా పురుషుల టీమ్‌ విభాగంలో సహచరులు వెనుకబడిన ప్రతి సందర్భంలో కీలక విజయాలతో జట్టును అజేయంగా నిలపడంలో గుకేశ్‌ పాత్ర ఎంతో ఉంది. ఒలింపియాడ్‌పై మాట్లాడుతూ ‘ఈ టోర్నీని నేను ఒక వ్యక్తిగత ఈవెంట్‌గా భావించాను. కాబట్టే ప్రతి గేమ్‌లో ఇతరుల ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. 

ఒలింపియాడ్‌లో నా ప్రదర్శన నాకెంతో సంతృప్తినిచ్చింది. జట్టు ప్రదర్శన కూడా బాగుంది’ అని అన్నాడు. తాజా ఫలితం తమ సానుకూల దృక్పథానికి నిదర్శనమని అన్నాడు. భారత ఆటగాళ్లంతా సరైన దిశలో సాగుతున్నారని చెప్పుకొచ్చాడు.  

ఘనస్వాగతం 
అంతకుముందు బుడాపెస్ట్‌ నుంచి చెస్‌ ఒలింపియాడ్‌ విజేతలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి, పురుషుల జట్టు కెప్టెన్‌ శ్రీనాథ్‌ నారాయణ్‌లకు చెన్నైలో చెస్‌ సంఘం అధికారులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. 

పూల బోకేలతో స్వాగతం పలికిన అభిమానులు పలువురు గ్రాండ్‌మాస్టర్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చెస్‌ ఒలింపియాడ్‌లో గతంలో ఉన్న కాంస్యం రంగు మార్చి బంగారు మయం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు. 

అతని సోదరి వైశాలి మాట్లాడుతూ సొంతగడ్డపై జరిగిన గత ఈవెంట్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న తమ పసిడి కల తాజాగా హంగేరిలో సాకారమైందని హర్షం వ్యక్తం చేసింది. వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లకు ఢిల్లీ చెస్‌ సంఘం అధికారులు, హైదరాబాద్‌లో ద్రోణవల్లి హారికకు భారత స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)