Breaking News

రూ. 2 కోట్ల 12 లక్షలకు...

Published on Wed, 12/04/2024 - 03:46

సిడ్నీ: క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ ధరించిన ‘బ్యాగీ గ్రీన్‌’ క్యాప్‌కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ధరించిన ఈ క్యాప్‌పై వేలంలో  పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు ఇదే చివరి సిరీస్‌ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్‌మన్‌ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం. 

పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) దీనిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్‌మన్‌ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్‌మన్‌ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది. 

ఈ బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌కు ఆసక్తికర నేపథ్యం ఉంది. భారత్‌తో సిరీస్‌ ముగిశాక బ్రాడ్‌మన్‌ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్‌ పంకజ్‌ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్‌ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్‌ కుమార్‌ సేన్‌కు పంకజ్‌ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్‌ ఇప్పుడు వేలానికి వచ్చింది.   
 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)