నరాలు తెగే ఉత్కంఠ.. బంగ్లా ప్లేయర్‌ ఊచకోత.. చివరి ఓవర్‌లో 30 పరుగులు

Published on Thu, 01/09/2025 - 19:22

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ (జనవరి 9) అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ జరిగింది. ఫార్చూన్‌ బారిషల్‌తో జరిగిన సమరంలో రంగ్‌పూర్‌ రైడర్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్‌ రైడర్స్‌ గెలుపుకు చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమయ్యాయి. 

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ మేయర్స్‌ బంతిని అందుకోగా.. నురుల్‌ హసన్‌ స్ట్రయిక్‌ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్‌.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్‌ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్‌ మరో సిక్సర్‌ బాది రంగ్‌పూర్‌ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. 

మొత్తంగా కైల్‌ మేయర్స్‌ వేసిన చివరి ఓవర్‌లో నురుల్‌ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్‌ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్‌) చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫార్చూన్‌ బారిషల్‌.. కైల్‌ మేయర్స్‌ (29 బంతుల్లో 61 నాటౌట్‌; ఫోర్‌, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్‌ (40), షాంటో (41) రాణించారు. 

ఆఖర్లో ఫహీమ్‌ అష్రాఫ్‌ (6 బంతుల్లో 20 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. బారిషల్‌ ఇన్నింగ్స్‌లో తౌహిద్‌ హృదోయ్‌ (23) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. మహ్మదుల్లా (2) విఫలమయ్యాడు. రంగ్‌పూర్‌ బౌలర్లలో కమ్రుల్‌ ఇస్లాం 2, సైఫుద్దీన్‌, అకిఫ్‌ జావెద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్‌పూర్‌ రైడర్స్‌ చివరి బంతికి విజయం​ సాధించింది. కెప్టెన్‌ నురుల్‌ హసన్‌ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో రంగ్‌పూర్‌ గెలుపుకు 26 పరుగులు అవసరం కాగా.. నురుల్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 30 పరుగులు పిండుకున్నాడు. 

నురుల్‌ ఊచకోత ధాటికి బౌలర్‌ కైల్‌ మేయర్స్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో నురుల్‌ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంగ్‌పూర్‌ గెలుపుకు తౌఫిక్‌ ఖాన్‌ (38), సైఫ్‌ హస్సన్‌ (22), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (48), ఖుష్దిల్‌ షా (48) పునాది వేశారు. ప్రస్తుత బీపీఎల్‌ ఎడిషన్‌లో రంగ్‌పూర్‌ రైడర్స్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)