Breaking News

రూ. 500కే లవ్లీనా అకాడమీలో బాక్సింగ్‌ శిక్షణ

Published on Sat, 06/07/2025 - 00:53

గువాహటి: భారత స్టార్‌ మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌ తన ఒలింపిక్స్‌ కలను సాకారం చేసుకున్నట్లే మిగతా వారు కూడా ఒలింపియన్లుగా ఎదగాలనే లక్ష్యంతో అకాడమీని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తర గువాహటిలోని బర్చండ్రాలో గురువారం లాంఛనంగా ప్రారంభమైన ఈ అకాడమీలో ఫీజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ వెచ్చించే విధంగా నెలకు కేవలం రూ. 500 చెల్లించి ఇక్కడ ‘పంచ్‌’లు నేర్చుకోవచ్చు. 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయో విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అలాగే 18 ఏళ్ల పైబడిన వారికి కూడా కోచింగ్‌ ఇస్తారు. 

ఆమె లాభాపేక్షలేని కృషిని గుర్తించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రూ. 2 కోట్ల గ్రాంట్‌ను అందజేయనున్నట్లు ప్రకటించారు. లవ్లీనా తన అకాడమీకి ప్రభుత్వ స్థలాన్ని అడగలేదు. 2021లో సొంతంగా అకాడమీ ఏర్పాటు కోసం స్థలం కొనుగోలు చేసిన ఆమె మెరుగైన మౌలిక సదుపాయాలతో దాన్ని తీర్చిదిద్దింది. 26–26 సైజ్‌ బాక్సింగ్‌ రింగ్‌తో పాటు ఆధునిక పరికరాలతో కూడిన జిమ్‌ను ఏర్పాటు చేసింది. గువాహటిలో సకల హంగులతో నెలకొల్పిన తొలి బాక్సింగ్‌ అకాడమీగా చెప్పవచ్చు. 

అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల బాలబాలికలు, యువత కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతిభాసక్తులు ఉన్న వారు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు, ప్రొఫెషనల్‌ బాక్సర్లుగా తయారయ్యేందుకు ఈ అకాడమీ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా లవ్లీనా పేర్కొంది. కొత్త తరం బాక్సర్లకు ఇదో వేదికగా మారాలని ఆకాంక్షించింది. 

‘మేటి బాక్సర్లను తయారు చేయాలనే కలతో దీన్ని నిర్మించాను. ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు తేవాలని, 2028కల్లా కొందరైనా బాక్సర్లు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను’ అని 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా చెప్పింది. దశలవారీగా బాక్సర్లకు హాస్టల్‌ వసతి కల్పించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటామని చెప్పింది.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)