Breaking News

బోపన్న జంటకు నిరాశ

Published on Mon, 10/27/2025 - 04:34

బాసెల్‌: స్విస్‌ ఇండోర్స్‌ బాసెల్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–బెన్‌ షెల్టన్‌ (అమెరికా) జోడీకి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో బోపన్నషెల్టన్‌ ద్వయం 6–7 (2/7), 5–7తో ఆడమ్‌ పావ్లాసెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)–జాన్‌ జిలిన్‌స్కీ (పోలాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–అమెరికన్‌ జోడీ ఐదు ఏస్‌లు సంధించింది. 

తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్నషెల్టన్‌లకు 41,820 (రూ. 42 లక్షల 65 వేలు) యూరోల ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌ మార్సెల్‌ గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)–హొరాసియో జెబలాస్‌ (అర్జెంటీనా) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో గ్రానోలెర్స్‌–జెబలాస్‌ 6–2, 7–5తో పావ్లాసెక్‌–జిలిన్‌స్కీలపై గెలిచి 1,54,980 యూరోల (రూ. 1 కోటీ 58 లక్షలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)