Breaking News

విజయంతో ముగించిన బోపన్న–ఎబ్డెన్‌ జోడీ

Published on Sat, 11/16/2024 - 03:48

ట్యూరిన్‌: భారత టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్‌ బ్రయాన్‌ గ్రూప్‌’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కెవిన్‌ క్రావిట్జ్‌–టిమ్‌ ప్యూట్జ్‌ (జర్మనీ) జంటను ఓడించింది. 

ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్‌–ప్యూట్జ్‌ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్‌తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు. 

వచ్చే సీజన్‌లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్‌ జంట ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్‌ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కూడా సాధించింది.   

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)