Breaking News

బోపన్న–ఎబ్డెన్‌ జోడీకి మయామి మాస్టర్స్‌ టైటిల్‌

Published on Sun, 03/31/2024 - 03:10

ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్‌ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రెండో సీడ్‌ ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. బోపన్న కెరీర్‌లో ఇది 26 డబుల్స్‌ టైటిల్‌కాగా... ‘మాస్టర్స్‌ సిరీస్‌’లో ఆరో టైటిల్‌ కావడం విశేషం.

44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్‌ సిరీస్‌’లో ఇండియన్‌ వెల్స్‌ (2023), మోంటెకార్లో ఓపెన్‌ (2017), మాడ్రిడ్‌ ఓపెన్‌ (2015), పారిస్‌ ఓపెన్‌ (2012), పారిస్‌ ఓపెన్‌ (2011) టైటిల్స్‌ సాధించాడు. లియాండర్‌ పేస్‌ (2012లో) తర్వాత మయామి ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు.   
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)