Breaking News

క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్..

Published on Thu, 06/22/2023 - 15:40

ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20, టీ10 లీగ్‌లు పట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. తాజాగా జింబాబ్వే కూడా ఓ టీ10 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌కు  జింబాబ్వే క్రికెట్‌ 'జిమ్ ఆఫ్రో టీ10' అని నామకారణం చేసింది.

జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి.

సంజయ్ దత్ న్యూ జర్నీ.. 
ఇక ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు.  ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్‌ దత్‌ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని సంజయ్‌ దత్‌ కూడా దృవీకరించాడు. 

"భారత్‌లో క్రికెట్‌ ఒక మతం వంటింది. అదే విధంగా ప్రపంచక్రికెట్‌లో భారత్‌ ఒక ప్రత్యేక గుర్తుంపు ఉంది. ప్రపంచంలో ప్రతీ చోట క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను. జింబాబ్వే కూడా గొప్ప క్రీడా చరిత్రను కలిగిఉంది. అటువంటి  జింబాబ్వే క్రికెట్‌లో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో టీ10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను" అని సంజయ్ దత్ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)