Breaking News

విజయోస్తు!

Published on Fri, 11/14/2025 - 04:05

బెంగళూరు: కొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల టెన్నిస్‌ జట్టు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ప్లే ఆఫ్‌ టోలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ మెగా టోర్నీ భారత్‌ వేదికగా తొలిసారి జరగనుంది. గ్రూప్‌ ‘జి’లో ఆతిథ్య భారత్‌తోపాటు స్లొవేనియా, నెదర్లాండ్స్‌ జట్లున్నాయి. మూడు జట్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్‌ ‘జి’ విజేత జట్టు వచ్చే ఏడాది బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. మిగతా రెండు జట్లు రీజినల్‌ గ్రూప్‌–1 టోర్నీలో ఆడతాయి. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణేలో జరిగిన రీజినల్‌ గ్రూప్‌–1లో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి 2021 తర్వాత రెండోసారి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌కు అర్హత పొందింది. అయితే లాత్వియాతో జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–3తో ఓడిపోయింది.  శుక్రవారం తొలి రోజు స్లొవేనియా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఆ తర్వాత శనివారం స్లొవేనియాతో... ఆదివారం నెదర్లాండ్స్‌తో భారత్‌ ఆడుతుంది. ర్యాంకింగ్‌ పరంగా స్లొవేనియా, నెదర్లాండ్స్‌ జట్లకంటే వెనుకబడి ఉన్నప్పటికీ సొంతగడ్డపై భారత్‌ నుంచి అద్భుతాన్ని ఆశించవచ్చు. 

భారత ఆశలన్నీ సింగిల్స్‌ ప్లేయర్లు, హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మికలపైనే ఆధారపడి ఉన్నాయి.  ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీలో రషి్మక విశేషంగా రాణించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్‌కు ప్లే ఆఫ్‌ బెర్త్‌ దక్కడంలో తనవంతు పాత్రను పోషించింది. మరోవైపు సహజ యామలపల్లి కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తోంది. ఇటీవల మెక్సికోలో జరిగిన డబ్ల్యూటీఏ–125 టోర్నీలో 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, అమెరికా స్టార్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ను సహజ ఓడించి సంచలనం సృష్టించింది. 

అదే తరహా ప్రదర్శనను సహజ సొంతగడ్డపై పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. సహజ, రషి్మకలతోపాటు అంకిత రైనా, రియా భాటియా, ప్రార్థన తొంబారే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. సింగిల్స్‌లో సహజ, రషి్మక బరిలోకి దిగనుండగా... డబుల్స్‌లో అంకిత రైనా, రియా భాటియా, ప్రార్థన ఆడనున్నారు. ‘మేము చరిత్ర సృష్టించాలనే అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. 

మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలనే లక్ష్యంతో ఉన్నాం. మేము ఆడాల్సిన రెండు జట్లు పటిష్టమైనవి. వారిపై ఎలా నెగ్గాలనే దానిపై ప్రణాళికలు రచించాం. వాటిని మైదానంలో అమలు చేయాలి. మా నియంత్రణలో ఉన్న వాటిపై ఆలోచిస్తాం. మా పరిధిలో లేని వాటి గురించి ఆలోచించదల్చుకోలేదు’ అని భారత మహిళల జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెపె్టన్‌ విశాల్‌ ఉప్పల్‌ తెలిపాడు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు