Breaking News

ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు మధురవాడ కుర్రాడు

Published on Mon, 01/23/2023 - 10:16

మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్‌ ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్‌ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు.

అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్‌ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్‌ టోర్నమెంట్‌లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్‌ పాల్గొంటున్నాడు.

భానుస్వరూప్‌ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)