Breaking News

రష్మికకు ఐటీఎఫ్‌ టైటిల్‌

Published on Sun, 03/16/2025 - 02:48

సాక్షి, హైదరాబాద్‌: భారత యువ టెన్నిస్‌ ప్లేయర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్‌లో ఆరో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. భారత్‌కే చెందిన వైదేహి చౌదరీతో కలిసి రష్మిక డబ్ల్యూ 35 డబుల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఐటీఎఫ్‌ వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌లో భాగంగా... థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన డబ్ల్యూ 35 టోర్నీ మహిళల డబుల్స్‌ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–4, 6–3తో పునిన్‌ కొవాపిటుక్‌టెడ్‌ (థాయ్‌లాండ్‌)–యుకీ నైటో (జపాన్‌) ద్వయంపై విజయం సాధించింది. 

మ్యాచ్‌ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన భారత జోడీ... వరుస సెట్లలో విజృంభించి టైటిల్‌ చేజిక్కించుకుంది. 1 గంట 18 నిమిషాల పాటు సాగిన పోరులో రష్మిక–వైదేహి 2 ఏస్‌లు సంధించి ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. 9 బ్రేక్‌ పాయింట్లు కాచుకున్న భారత ప్లేయర్లు... ఓవరాల్‌గా 61 పాయింట్లు సాధించి సునాయాసంగా గెలుపొందారు. 

హైదరాబాద్‌కు చెందిన రష్మికకు ఇది రెండో డబ్ల్యూ 35 టైటిల్‌ కాగా... ఓవరాల్‌గా ఆరోది. 2024లో డబ్ల్యూ 35 ఇండోర్, 2023లో డబ్ల్యూ 15 అహ్మదాబాద్, డబ్ల్యూ 15 థాయ్‌లాండ్, డబ్ల్యూ 25 థాయ్‌లాండ్, 2022లో డబ్ల్యూ 15 గురుగ్రామ్‌ టోర్నమెంట్‌లలో రష్మిక డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ ఆరింట్లో నాలుగుసార్లు వైదేహి చౌదరీతో కలిసే రష్మిక విజయాలు సాధించింది.   

#

Tags : 1

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)