Breaking News

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లకే రిటైర్మెంట్‌

Published on Fri, 05/31/2024 - 11:18

న్యూజిలాండ్‌ మహిళ క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌  బెర్నాడిన్ బెజుడెన్‌హౌట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బెజుడెన్‌హౌట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఆమె శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడంచింది. తను స్థాపించిన ఛారిటబుల్ ది ఎపిక్‌ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించేందుకు బెజుడెన్‌హౌట్ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా దక్షిణాఫ్రికాకు చెందిన బెజుడెన్‌హౌట్.. 2014లో తన సొంతదేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కానీ తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2017లో న్యూజిలాండ్‌కు మాకాం మార్చింది. ఈ క్రమంలో 2018లో కివీస్‌ తరపున ఆమె డెబ్యూ చూసింది. 30 ఏళ్ల బెజుడెన్‌హౌట్ ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 20 వన్డేలు, 29 టీ20లు ఆడింది. అందులో నాలుగు వన్డేలు, 7 టీ20ల్లో సౌతాఫ్రికా ఆమె ప్రాతినిథ్యం వహించింది.

"న్యూజిలాండ్‌కు క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాడు. వైట్ ఫెర్స్‌తో నా ప్రయాణం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా విషయాలను నేర్చుకున్నాను. ఈ రోజు నేను క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. 

ఇకపై ది ఎపిక్‌ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాను. ఈ నా అద్బుత ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్‌ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)