Breaking News

మెరిసిన షమీ

Published on Mon, 01/26/2026 - 03:06

కోల్‌కతా: రంజీ ట్రోఫీలో బెంగాల్‌ జట్టు నాకౌట్‌ దశకు దూసుకెళ్లింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా బెంగాల్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో సర్వీసెస్‌ను మట్టికరిపించి బోనస్‌ పాయింట్‌ ఖాతాలో వేసుకుంది. బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా... సర్వీసెస్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయింది. 

తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆలౌటైన సర్వీసెస్‌...‘ఫాలోఆన్‌’ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 287 పరుగులకు పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 231/8తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సర్వీసెస్‌ కాస్త ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. జయంత్‌ (68 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో పారాడాడు. 

బెంగాల్‌ బౌలర్లలో టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ షమీ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డబుల్‌ సెంచరీ’ సాధించిన సుదీప్‌ చటర్జీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌ దశలో 6 మ్యాచ్‌లాడిన బెంగాల్‌ 4 విజయాలు, 2 ‘డ్రా’లతో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.  

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)