Breaking News

న్యూజిలాండ్‌- పాక్‌ వార్మప్‌ మ్యాచ్‌.. బీసీసీఐ కీలక ప్రకటన

Published on Tue, 09/26/2023 - 08:24

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా వార్మప్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ 29న న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరగనున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరగనుంది.

భద్రతా కారణాల దృష్ట్యా  ఈ మ్యాచ్‌‌‌‌కు ప్రేక్షకులను అనుమతించ కూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి మొత్తం డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

"ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ వార్మప్‌ మ్యాచ్‌ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. స్థానిక భద్రతా సంస్థల సలహా మేరకు   ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌ను నిర్వహించనున్నాం. ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రతీ ఒక్కరికి రిఫెండ్‌ చేస్తామని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది...  రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్‌ జట్టు   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)