Breaking News

ఆసీస్ యువ ఆట‌గాడి విధ్వంసం.. 39 బంతుల్లోనే సెంచరీ! ఎవరీ ఓవెన్‌?

Published on Mon, 01/27/2025 - 17:01

హోబ‌ర్ట్ వేదిక‌గా సిడ్నీ థండ‌ర్‌తో జ‌రిగిన‌ ఫైన‌ల్లో హోబర్ట్ హరికేన్స్ ఓపెన‌ర్ మిచెల్ ఓవెన్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో మెరిశాడు. 183 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఓవెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిడ్నీ బౌల‌ర్ల‌ను ఓవెన్ ఊతికారేశాడు. అత‌డిని అప‌డం ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు బౌల‌ర్ల త‌రం కాలేదు. ఈ క్ర‌మంలో 39 బంతుల్లోనే ఓవెన్ త‌న రెండో బీబీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్‌.. 6 ఫోర్లు, 11 సిక్స్‌ల‌తో 108 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఓవెన్ తొలుత కేవ‌లం 16 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. త‌ద్వారా ఓ అరుదైన రికార్డును ఓవెన్ త‌న పేరిట లిఖించుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన మూడో ఆట‌గాడిగా టామ్ బాంట‌న్‌తో క‌లిసి మిచెల్ సంయుక్తంగా నిలిచాడు.

బీబీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డు వెస్టిండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2016 సీజ‌న్‌లో ఆడిలైడ్ స్ట్రైక‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ కేవ‌లం 12 బంతుల్లోనే ఆర్ద‌శ‌త‌కంతో మెరిశాడు. ఆ త‌ర్వాత స్ధానంలో డానియ‌ల్ క్రిస్టియ‌న్‌(15 బంతులు), ఓవెన్‌(16), బాంట‌న్‌(16) ఉన్నారు.

బీబీఎల్ విజేత‌గా హోబర్ట్‌..
ఇక బీబీఎల్ 2024-25 సీజ‌న్ విజేత‌గా హోబర్ట్ హరికేన్స్ నిలిచింది.  తుది పోరులో సిడ్నీను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన హోబ‌ర్ట్‌.. తొలిసారి బీబీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. 183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఓవెన్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా హోబ‌ర్ట్‌.. కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 14.1 ఓవ‌ర్ల‌లో చేధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. సిడ్నీ బ్యాట‌ర్ల‌లో జాస‌న్ సంగ‌(67) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. డేవిడ్ వార్న‌ర్‌(48) ప‌రుగుల‌తో రాణించారు. హోబర్ట్ బౌలర్లలో మెరిడిత్‌, ఇల్లీస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.

ఎవరీ మిచెల్ ఓవెన్‌..?
23 ఏళ్ల మిచెల్ ఓవెన్‌ లిస్ట్‌-ఎ,  ఫస్ట్‌క్లాస్‌​ క్రికెట్  రెండింటిలోనూ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  ఫిబ్రవరి 22, 2021న మార్ష్ వన్-డే కప్‌లో లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఓవెన్‌.. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అక్టోబర్ 3, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా 24 టీ20ల్లో 33.18 సగటుతో 531 పరుగులు చేశాడు. 

అందులో 452 పరుగులు ఈ ఏడాది బిగ్‌బాష్‌ సీజన్‌లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్‌ 2024-25 సీజన్‌లో ఓవెన్‌ 452 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌‍స్కోరర్‌గా నిలిచాడు. ఓవెన్‌కు పేస్‌ బౌలింగ్‌ చేసే సత్తాకూడా ఉంది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)