Breaking News

ఢిల్లీతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌!

Published on Mon, 04/24/2023 - 16:43

IPL 2023- SRH Vs DC: ఐపీఎల్‌-2023లో సీఎస్‌కే చేతిలో ఘోర ఓటమి చవి చూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరెంజ్‌ ఆర్మీ భావిస్తోంది.

వాళ్లిద్దరు అవుట్‌
అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రెండు మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న మయాంక్‌ అగర్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా 8.25 కోట్ల భారీ మొత్తాన్ని తీసుకున్న అగర్వాల్‌.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో మయాంక్‌ స్ధానంలో సమర్థ్ వ్యాస్, సుందర్‌ ప్లేస్‌లో మయాంక్‌ దాగర్‌కు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

వీళ్లకు ఛాన్స్‌
సౌరాష్ట్రకు చెందిన వ్యాస్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 41 మ్యాచ్‌లు ఆడిన వ్యాస్‌ 1365 పరుగులు సాధించాడు. అదే విధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ దాగర్‌.. వికెట్లు తీయకపోయినప్పటికీ పర్వాలేదనపించాడు. 3 ఓవర్లు వేసిన దాగర్‌ 21 పరుగులిచ్చాడు. ఇక కేకేఆర్‌తో గెలిచి మంచి ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి.

ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌) వ్యాస్‌, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సెన్, మయాంక్‌ దాగర్‌, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మాలిక్
చదవండి: Mohammed Siraj: మహిపాల్‌ను దూషించిన సిరాజ్‌! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్‌! ఇలాంటివి.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)