Breaking News

హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌.. కెప్టెన్‌గా కృనాల్‌ పాండ్యా

Published on Sat, 11/07/2026 - 15:03

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బరోడా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అతీత్ షేత్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ పాండ్యా బరోడా జట్టుకు నాయకత్వం వహించడం ఇది నాలుగోసారి.

కానీ ఈ ఐపీఎల్ స్టార్ బరోడాకు ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించలేకపోయాడు. 2023లో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఓవ‌రాల్‌గా మాత్రం బ‌రోడా    రెండుసార్లు (2011, 2013) ఈ టీ20 ట్రోఫీని గెలుచుకుంది.

ఇక ఈ 15 మంది సభ్యుల జ‌ట్టులో సీనియర్ ఆటగాళ్లు దీపక్ హుడా, జీతేష్ శర్మలతో పాటు పేసర్ రసిక్ దార్ కూడా చోటు ద‌క్కింది.  ప్రియాన్షు మోలియా, చింతల్ గాంధీని స్టాంబ్ బై ప్లేయ‌ర్ల‌గా ఎంపిక చేశారు. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న హార్దిక్‌కు చోటు దక్కలేదు. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 19వ ఎడిషన్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. బరోడా జట్టు తన తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడనుంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 కోసం బరోడా జట్టు
కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతీత్ షేత్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, శివాలిక్ శర్మ, శాశ్వత్ రావత్, అమిత్ పాస్సీ (వికెట్ కీపర్), జీతేష్ శర్మ (వికెట్ కీపర్), భాను పానియా, మహేష్ పిథియా, పరిక్షిత్ పటీదార్, హేమంత్ పుండే, రాజ్ లింబానీ, రసిక్ దార్, ధ్రువ్ బి. పటేల్, సఫ్వాన్ పటేల్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: ప్రియాన్షు మోలియా, చింతల్ గాంధీ.
చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా పేసర్‌.. 23 ఏళ్ల జహీర్‌ ఖాన్‌ రికార్డ్ బ్రేక్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)