Breaking News

భారీ ఆధిక్యంలో బంగ్లాదేశ్‌

Published on Sat, 11/22/2025 - 03:41

మిర్పూర్‌: సొంతగడ్డపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న బంగ్లాదేశ్‌ జట్టు... ఐర్లాండ్‌తో రెండో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (110 బంతుల్లో 69 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో గావిన్‌ హోయ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. 

నేడు ఆటకు నాలుగో రోజు కాగా... చేతిలో 9 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్‌... ప్రస్తుతం 367 పరుగుల ఆధిక్యంలో ఉంది. షాద్‌మన్‌తో పాటు మోమినుల్‌ హక్‌ (19 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 98/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ జట్టు... 88.3 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ టకర్‌ (171 బంతుల్లో 75 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... జోర్డన్‌ నీల్‌ (83 బంతుల్లో 49; 9 ఫోర్లు), స్టీఫెన్‌ (77 బంతుల్లో 46; 4 ఫోర్లు) చక్కటి పోరాటం కనబర్చారు. 

బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 4 వికెట్లు పడగొట్టగా... ఖాలెద్‌ అహ్మద్, హసన్‌ మురాద్‌ చెరో 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోరు చేయడంతో... ఆ జట్టుకు 211 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ జరుగుతన్న సమయంలో ఉదయం సెషన్‌లో భూప్రకంపనలు రావడంతో కొన్ని నిమిషాలపాటు ఆటను నిలిపి వేశారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)