Breaking News

చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్‌.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Published on Wed, 12/20/2023 - 13:42

నెల్సన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. గత రెండేళ్లుగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సర్కార్‌.. ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝుళిపించాడు.

ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్‌.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా సర్కార్‌ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్‌ దాస్‌(176) అగ్రస్ధానంలో ఉన్నాడు.

సచిన్‌ రికార్డు బ్రేక్‌..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సర్కార్‌ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆసియా క్రికెటర్‌గా సర్కార్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్‌తో సర్కార్‌ 14 ఏళ్ల మాస్టర్‌బ్లాస్టర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్‌ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌క్యాప్స్‌ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్‌(89), నికోల్స్‌(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్(169) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్‌సన్‌, ఆశోక్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్‌ 23న నేపియర్‌ వేదికగా జరగనుంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)