Breaking News

PAKvBAN: క్లీన్‌స్వీప్‌ దిశగా బంగ్లాదేశ్‌

Published on Tue, 09/03/2024 - 07:48

రావల్పిండి: పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్‌ హసన్‌ (31 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (9 బ్యాటింగ్‌) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది.

 ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్‌ అయూబ్‌ (20; 3 ఫోర్లు), కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్‌ ఆజమ్‌ (11; 1 ఫోర్‌) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్‌ అహ్మద్‌ ఓవర్లో అయూబ్‌ ని్రష్కమించగా, యువ సీమర్‌ నహిద్‌ రాణా... మసూద్, బాబర్‌లతో పాటు సౌద్‌ షకీల్‌ (2)ల వికెట్లను పడగొట్టాడు. 

దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్‌ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్‌ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్‌ను హసన్‌ మహ్ముద్‌ అవుట్‌ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్‌ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్‌ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 

రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్‌ హసన్‌ మహ్ముద్‌ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్‌ నహిద్‌ రాణా (4/44) పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్‌ హసన్, ఇస్లామ్‌ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ 10 వికెట్ల తేడాతో గెలిచింది.  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)