Breaking News

రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..

Published on Sun, 06/23/2024 - 14:10

భార‌త స్టార్ రెజ‌ర్, ఒలింపిక్ విజేత  బజరంగ్ పునియాకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (NADA ) మ‌రోసారి బిగ్ షాకిచ్చింది.  బజరంగ్‌ పూనియాపై నాడా స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. 

బజరంగ్ పునియా డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు నాడా ఆదివారం సస్పెండ్ చేసింది. అత‌డికి తాజాగా జాతీయ డోప్ కంట్రోల్ ఏజెన్సీ నోటీసు అంద‌జేసింది.

అసలేం జ‌రిగిందంటే?
ఈ  ఏడాది మార్చిలో సోనిపట్‌లో జరిగిన ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై  బజరంగ్ పునియా ఓడిపోయాడు. ఆ త‌ర్వాత బజ‌రంగ్ పూనియాపై డోపింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్ అతడి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది. 

కానీ పునియా మాత్రం యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. ఈ క్ర‌మంలో నాడా.. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(వాడా)కు  పూనియా వ్య‌వ‌హ‌రం తెలియ‌జేసింది.

దీంతో బజ‌రంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వ‌డానికి నిరాక‌రించాడో వివ‌రణ కోరుతూ నోటీసు ఇవ్వ‌మ‌ని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో నాడా ఏప్రిల్ 26లోపు త‌న వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పూనియాకు నోటీసు జారీ చేసింది. 

కానీ పూనియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయిన‌ప్ప‌ట‌కి నాడా మ‌ళ్లీ మే 7లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుల‌కు కూడా పూనియా స‌మాధాన‌మివ్వ‌లేదు. దీంతో గ‌త నెల‌లో అత‌డిపై తాత్కాలిక నిషేదం విధించింది.

అయితే నాడా నోటీసులకు స్పదించని పూనియా.. నాడా క్రమశిక్షణ సంఘంకు మాత్రం తన వివరణ ఇచ్చాడు. డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. 

దీంతో జూన్4న బజ‌రంగ్‌పై  జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే అతడు కావాలనే డోప్ టెస్టు తప్పించుకుంటున్నాడని భావించిన నాడా మరోసారి అతడిపై నిషేదం విధించింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని  నోటీసులో నాడా పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)