Breaking News

అఫ్గాన్‌ ప్లేయర్‌ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Thu, 02/27/2025 - 12:16

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్తాన్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను 8 పరుగుల తేడాతో అఫ్గాన్ మట్టికర్పించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అఫ్గానిస్తాన్  తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్లలలో ఇంగ్లండ్‌ను అఫ్గానిస్తాన్ ఓడించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం​.

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి సెమీఫైన్‌ల్‌కు చేరేందుకు అఫ్గానిస్తాన్ అడుగుదూరంలో నిలిచింది. ఫిబ్ర‌వ‌రి 28న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదిక‌గా ఆస్ట్రేలియాతో షాహిది బృందం తలపడనుంది.

ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర..
కాగా అఫ్గాన్ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 41 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన  ఒమర్జాయ్.. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో 5 వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి ప‌త‌నాన్ని శాసించాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 40 ప్లస్ పరుగులతో పాటు 5 వికెట్ల తీసిన తొలి ఆటగాడిగా ఒమర్జాయ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేదు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ చరిత్రలో రన్ ఛేజింగ్‌లో 5 వికెట్ల హాల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా ఒమర్జాయ్ నిలిచాడు. ఈ జాబితాలో జాక్వెస్ కల్లిస్, మఖాయా ఏంటిని, జాకబ్ ఓరమ్, మెక్‌గ్రాత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.

జద్రాన్‌ సూపర్‌ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్‌​ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 146 బంతులు ఎదుర్కొన్న జద్రాన్‌.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేశాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్‌(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్‌ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)