Breaking News

ఆయుశ్‌ సంచలనం

Published on Fri, 09/12/2025 - 04:18

హాంకాంగ్‌: భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ శెట్టి హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో సంచలనం సృష్టించాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)ను బోల్తా కొట్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్‌ ఆయుశ్‌ 72 నిమిషాల్లో 21–19, 12–21, 21–14తో ఐదో సీడ్‌ నరోకాను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సహచరుడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 15–21, 21–18, 21–10తో గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్లో ఆయుశ్‌ శెట్టితో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మరో మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి (భారత్‌) 6–21, 12–21తో చౌ టియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 

పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 18–21, 21–15, 21–11తో పిరత్‌చాయ్‌ సుఖ్‌ఫున్‌–పకాపోన్‌ తీరత్‌సాకుల్‌ (థాయ్‌లాండ్‌) జంటపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్‌) జోడీ 13–21, 7–21తో లి యి జింగ్‌–లువో జు మిన్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)