Breaking News

ఆయుశ్‌ మాత్రే అజేయ శతకం

Published on Sat, 11/29/2025 - 03:36

లక్నో: యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (53 బంతుల్లో 110 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో ముంబై జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విదర్భ 20 ఓవర్లలో 9 వికెట్లకు 192 పరుగులు చేసింది. 

ఓపెనర్లు అథర్వ తైడె (36 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్‌), అమన్‌ (30 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 115 పరుగులు జోడించడంతో విదర్భకు గట్టి పునాది దక్కింది. అయితే ఆ తర్వాత తేరుకున్న ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ విదర్భను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. 

ధ్రువ్‌ షొరే (1), యశ్‌ రాథోడ్‌ (23), హర్‌‡్ష దూబే (10), వరుణ్‌ బిస్త్‌ (5), దర్శన్‌ నల్కండే (7) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో శివమ్‌ దూబే, సాయిరాజ్‌ పాటిల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ముంబై 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఆయుశ్‌ మాత్రే అదరగొట్టగా... టీమిండియా టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), పేస్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే (39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. 

ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో రైల్వేస్‌ జట్టు 32 పరుగుల తేడాతో కేరళపై గెలిచింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’మ్యాచ్‌ల్లో ఉత్తరప్రదేశ్‌ జట్టు 109 పరుగుల తేడాతో జమ్మూకశీ్మర్‌పై, మధ్యప్రదేశ్‌ జట్టు 62 పరుగుల తేడాతో బిహార్‌పై విజయాలు సాధించాయి. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో తమిళనాడుపై, రాజస్తాన్‌ 5 వికెట్ల తేడాతో త్రిపురపై, ఉత్తరాఖండ్‌ 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై నెగ్గాయి.  

ఆయుశ్‌ అరుదైన రికార్డు 
ముంబై ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన పిన్నవయసు్కడిగా అతడు రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్, లిస్ట్‌ ‘ఎ’లో శతకాలు నమోదు చేసుకున్న మాత్రే... తాజాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్‌లో టి20 ఫార్మాట్‌లోనూ మూడంకెల స్కోరు చేశాడు. తద్వారా చిన్న వయసు (18 సంవత్సరాల 135 రోజులు)లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు