Breaking News

చరిత్ర సృష్టించిన జొకోవిచ్‌.. నాదల్‌ రికార్డు సమం

Published on Mon, 01/30/2023 - 10:31

పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ హస్తగతం చేసుకున్నాడు సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో గ్రీస్‌ ప్లేయర్‌ సిట్సిపాస్‌పై 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాదు కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో రాఫెల్‌ నాదల్‌ పేరిట ఉన్న రికార్డు సమం చేశాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నిలిచిన జొకోవిచ్‌ రికార్డులు
జకోవిచ్‌ నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ 22. ఇందులో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (10), వింబుల్డన్‌ (7), యూఎస్‌ ఓపెన్‌ (3), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2) ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాఫెల్‌ నాదల్‌ (22) సరసన జొకోవిచ్‌ నిలిచాడు.

నాదల్‌ను వెనక్కినెట్టి
జొకోవిచ్‌ కెరీర్‌లో నెగ్గిన టైటిల్స్‌ 93. అత్యధిక టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్‌ను (92) ఐదో స్థానానికి నెట్టి జొకోవిచ్‌ నాలుగో స్థానానికి ఎగబాకాడు. టాప్‌–3లో జిమ్మీ కానర్స్‌ (అమెరికా; 109), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌; 103), ఇవాన్‌ లెండిల్‌ (అమెరికా; 94) ఉన్నారు. పదికి పది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ 10 సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023) ఫైనల్‌ చేరుకోగా... పదిసార్లూ గెలిచాడు.
చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్‌.. సిట్సిపాస్‌కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)