టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
Published on Fri, 01/27/2023 - 08:35
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్‌లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్‌తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది.
(చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు'))
Tags : 1