Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో కిరణ్‌ జార్జి పరాజయం 

Published on Sat, 01/27/2024 - 11:13

ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ కిరణ్‌ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయాడు.    

ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు 
మహిళల హాకీ ఫైవ్స్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్‌ ఆడుతుంది.

సెమీఫైనల్లో భారత్‌ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి  అజ్మీనా ఒక్కో గోల్‌ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తోంది.

Australian Open 2024- మెల్‌బోర్న్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్‌ సినెర్‌..  ఫైనల్లోమెద్వెదెవ్‌తో తలపడనున్నాడు.  జొకోవిచ్‌ను ఓడించిన సినెర్‌.. జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు.    

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)