Breaking News

చాంపియన్‌ స్విమ్మర్‌... 25 ఏళ్లకే రిటైర్మెంట్‌

Published on Fri, 10/17/2025 - 04:42

బ్రిస్బేన్‌: అరిన్‌ ఎలిజబెత్‌ టిట్మస్‌ ఆస్ట్రేలియన్‌ స్విమ్మర్‌. అలాంటి... ఇలాంటి... స్విమ్మర్‌ కాదు. చాంపియన్‌... ఆహా... అంతకుమించే! ఈ అమ్మడు వయసు 25... పతకాల సంఖ్య బోలెడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్‌ గేమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో 32 పతకాలు. ఇందులో స్వర్ణాలే 18 అంటే... చాంపియన్‌ కాదు అంతకుమించి అనడంలో అతిశయోక్తి ఉండదేమో! మరో మెగా ఈవెంట్‌ లాస్‌ ఏంజెలిస్‌–2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతుందనుకుంటే... ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్‌ ప్రకటించింది. 

తన బంగారు క్రీడా భవిష్యత్తును పాతికేళ్లకే ముగించింది. గురువారం తన ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియో సందేశంతో ఫాలోవర్లతో పాటు అభిమానుల్ని విస్మయపరిచింది. ‘నేనెప్పటికీ స్విమ్మింగ్‌నే ప్రేమిస్తాను. చిన్నప్పుటి నుంచే అదే నా లోకం. అయితే అదే మొత్తం జీవితం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నా జీవితంలో స్విమ్మింగ్‌ కంటే ప్రధానమైనవి కూడా ఉన్నాయని ఈ మధ్యే గ్రహించాను. అందుకే ఇక చాలనుకుంటున్నా. ఇక్కడితోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా’ అని ఆ్రస్టేలియన్‌ స్టార్‌ స్విమ్మర్‌ వీడియోను పోస్ట్‌ చేసింది. 

గతేడాది జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో అమెరికా గ్రేట్‌ కేటీ లెడెకీ, కెనడా స్టార్‌ సమ్మర్‌ మెకింటోష్ లను వెనక్కి నెట్టి మరీ టిట్మస్‌ 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ ముగ్గురు కూడా దిగ్గజ స్విమ్మర్లు. అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు నెలకొల్పినవారే కావడంతో పారిస్‌ ఈవెంట్‌లో గెలుపెవరిదనే అంచనాలు ఆకాశన్నంటాయి. చివరకు అరిన్‌ టిట్మసే ‘బంగారు చేప’గా నిలిచింది. తన రిటైర్మెంట్‌ సందేశంలోనూ ఈ పోటీనే తన ఫేవరెట్‌ ఈవెంట్‌గా పేర్కొంది. 

హేమాహేమీలతో దీటైన పోటీని ఆస్వాదించినట్లు చెప్పింది. పారిస్‌ ఈవెంట్‌కు ముందు, ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల్ని సైతం ఎదుర్కొన్నట్లు అరిన్‌ చెప్పింది. 2023లో కూడా ఆమెకు శస్త్రచికిత్స చేసి ట్యూమర్లు తొలగించారు. అయితే ఏడాదిలోపే ఈ ‘ఆపరేషన్‌’ను అధిగమించి పతకాల ఆపరేషన్‌ను విజయవంతం చేసుకుంది. తన 25 ఏళ్ల జీవితంలో 18 ఏళ్లు కొలనులోనే గడిచిందని ఆమె చెప్పుకొచ్చింది.  

అరిన్‌ ఘనతలివే... 
తొమ్మిదేళ్ల క్రితం అంటే 16 ఏళ్ల ప్రాయంలోనే అరిన్‌ టిట్మస్‌ అంతర్జాతీయ పతకాల వేట మొదలైంది. 2016లో మాయిలో జరిగిన జూనియర్‌ పాన్‌ పసిఫిక్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం, కాంస్యం నెగ్గింది. ఇక సీనియర్‌ కేటగిరీలో అయితే బంగారు పతకాల మోతే మోగించింది. 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఫ్రీస్టయిల్, 4్ఠ200 మీటర్ల రిలే ఈవెంట్లలో 2018, 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు నిలబెట్టుకుంది. 

హాంగ్జౌ (2018), గ్వాంగ్‌జు (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ టైటిల్స్‌ను నిలబెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌తో విశ్వక్రీడల బరిలో దిగిన ఆమె 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెలిచిన ఆమె పారిస్‌లో నిలబెట్టుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)