Breaking News

ప్రియురాలితో ఆసీస్ మహిళా క్రికెట‌ర్ పెళ్ళి.. ఫోటోలు వైర‌ల్‌

Published on Sun, 04/06/2025 - 17:00

ఆస్ట్రేలియా మహిళా స్టార్ ఆల్ రౌండ‌ర్ ఆష్లీ గార్డనర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.  తన చిరకాల ప్రేయసి మోనికా రైట్‌ను పెళ్లి చేసుకుంది. ఈ శుభ‌వార్త‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో గార్డ‌న‌ర్ పంచుకుంది. కాగా 2021 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరిద్ద‌రూ గ‌తేడాది ఏప్రిల్‌లో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు.

ఈ వివాహ‌నికి ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్లు  అలిస్సా హీలీ, ఎల్లీస్ పెర్రీ, కిమ్ గార్త్, ఎలీస్ విల్లా హాజ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. కాగా మ‌హిళ‌ల క్రికెట్‌లో సేమ్ జెండ‌ర్ పెళ్లిల్లు కామ‌న్ అయిపోయాయి.

న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌- సహచరి లియా, ఇంగ్లండ్ స్టార ప్లేయ‌ర్లు స్కివ‌ర్-కేథ‌రిన్ బ్రంట్‌, ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్- కాప్‌,  డానియెల్‌ వ్యాట్‌- జార్జీ హోడ్జ్ జంట‌లు ఈ కోవ‌కు చెందిన వారే.

ఇక గార్డనర్ విష‌యానికి వ‌స్తే.. ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతోంది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో గుజ‌రాత్ జైయింట్స్ కెప్టెన్‌గా ఆమె వ్య‌హ‌రిస్తోంది. గార్డ‌న‌ర్ 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసింది. 

ఇప్ప‌టివ‌ర‌కు ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ ఆస్ట్రేలియా మహిళల జ‌ట్టు తరఫున ఏడు టెస్టులు, 77 వ‌న్డేలు, 96 టీ20లు ఆడింది. మూడు ఫార్మాటల్లో 3000కు పైగా ప‌రుగులు చేసిన గార్డ‌న‌ర్‌..  207 వికెట్లు కూడా ప‌డ‌గొట్టింది. అదేవిధంగా 2018,2020, 2023 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియన్ మహిళల జట్టులో గార్డ‌ర‌న్ భాగంగా ఉంది.
చ‌ద‌వండి: IPL 2025: చరిత్ర సృష్టించిన రాజస్థాన్‌ రాయల్స్‌

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు