Breaking News

టీ20ల్లో ఆస్ట్రేలియా విధ్వంసం.. ఏకంగా 274 పరుగులు

Published on Thu, 07/11/2024 - 13:05

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం నార్తాంప్టన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో బెన్‌ డంక్‌, క్రిస్టియన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విండీస్‌ బౌలర్లను ఊచకోత కోశారు.

డంక్‌ కేవలం 35 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో సెంచరీ మార్క్‌ను అందుకోగా.. క్రిస్టియన్‌ 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆసీస్‌ సాధించినదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. 

ఇక విండీస్‌ బౌలర్లలో ఎమిరిట్‌ 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 275 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ సైతం ధీటుగా బదులిచ్చింది. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని విండీస్‌ చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేయగల్గింది. 

విండీస్‌ బ్యాటర్లలో డ్వేన్‌ స్మిత్‌(64), నర్స్‌(70) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఆసీసీ బౌలర్లలో కెప్టెన్‌ బ్రెట్‌లీ రెండు, సిడిల్‌,  దోహర్టీ, కౌల్టర్‌ నైల్‌,క్రిస్టియన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్‌ సెమీఫైనల్లో జూలై 12న ఇండియా ఛాంపియన్స్‌తో ఆసీస్‌ తలపడనుంది.
 

Videos

నన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో వాడికే చెప్తున్నా.. పిన్నెల్లి మాస్ వార్నింగ్

DSC స్కామ్ పై లోకేష్ ఛాలెంజ్ లు నాగమల్లేశ్వరి అదిరిపోయే కౌంటర్

మేం ఏం తప్పు చేశామని... దేవుడిని కూడా దర్శించుకోనివ్వరా?

MAGAZINE Story: దగా DSCలో మెగా స్కామ్

DSCలో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం అంగీకారం

మంటల్లో కాలి బూడిదైన కారు

బద్దలైన అగ్నిపర్వతం.. లక్షల ప్రయాణికులపై ఎఫెక్ట్

చైనాలో బీభత్సం కళ్లు చెదిరేలా.. కొట్టుకుపోతున్న ఇళ్లు

కాలిఫోర్నియాలో సముద్రపు అలల బీభత్సం

BRS MLC తాతా మధు అరెస్ట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)