Breaking News

తిరుగులేని ఆసీస్‌.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం

Published on Sun, 03/03/2024 - 07:12

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్‌ 6 వికెట్లతో చెలరేగాడు. 111/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌.. అదనంగా 85 పరుగులు చేసి ఆలౌటైంది.

న్యూజిలాండ్‌ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(59) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌తో పాటు హాజిల్‌వుడ్‌ రెండు, హెడ్‌, గ్రీన్‌ తలా వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్‌ త​మ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 204 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో కివీస్‌ ముందు 369 పరుగులు భారీ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఉంచింది. 

కాగా మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్‌ అయింది. కామెరాన్‌ గ్రీన్‌ (174 నాటౌట్‌; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్‌ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. 

న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా స్కోర్లు:
ఆస్ట్రేలియా- 383 & 164
న్యూజిలాండ్‌- 179 & 196
ఫలితం: 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)