Breaking News

ICC Test Rankings: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 39 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి

Published on Wed, 06/14/2023 - 20:33

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు సత్తా చాటారు. తొలి మూడు స్ధానాలను ఆసీస్‌ బ్యాటర్లే దక్కించుకోవడం విశేషం. లబుషేన్ తొలి ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. అయితే టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ మూడు స్ధానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌ చేరుకున్నాడు.  

తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన హెడ్ 174 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. అతడితో పాటు స్మిత్‌ కూడా సెంచరీతో చెలరేగాడు. కాగా 39 ఏళ్ల తర్వాత ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్‌ 3 ర్యాంకింగ్స్‌లో ఉండడం ఇదే తొలి సారి. 1984లో వెస్టిండీస్‌ ఆటగాళ్లు గోర్డాన్ గ్రీనిడ్జ్ (810), క్లైవ్ లాయిడ్ (787), లారీ గోమ్స్ (773) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక టీమిండియా విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడకపోయనప్పటికీ వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టకున్నాడు. మరోవైపు రీ ఎంట్రీలో అదరగొట్టిన అజింక్య రహానే  37వ స్థానానికి చేరుకోగా, శార్దూల్ ఠాకూర్ బ్యాటర్లలో 94వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టాప్‌ 10లో భారత్‌ తరపున డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. పంత్‌ 10 స్ధానంలో కొనసాగుతుండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వరుసగా 13వ స్థానాల్లో ఉన్నారు.
చదవండి: IND vs WIL వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. హార్దిక్‌ పాండ్యా రీ ఎం‍ట్రీ!

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)