Breaking News

నాగపురి రమేశ్‌పై NADA సస్పెన్షన్‌ వేటు.. ఏ తప్పూ చేయలేదన్న కోచ్‌

Published on Sun, 04/20/2025 - 17:20

ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్, జాతీయ జూనియర్‌ జట్టు ప్రధాన కోచ్‌ అయిన నాగపురి రమేశ్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. డోపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అతడి దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారు. డోప్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వకుండా దాటవేశారు.

ఏడుగురిపై కూడా వేటు
ఈ క్రమంలో.. నిబంధనల ప్రకారం వారికి కోచ్‌గా ఉన్న నాగపురి రమేశ్‌పై నాడా చర్యలు తీసుకుంది. గతంలో  అతడు ద్రోణాచారి అవార్డు పొందాడు. అంతేకాదు.. అంతర్జాతీయ అథ్లెట్లు ద్యుతీ చంద్, పారా ఒలంపియన్‌, పతక విజేత జీవాంజి దీప్తి, అగసార నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘతన నాగపురి రమేశ్‌కు ఉంది.

ఇదిలా ఉంటే.. రమేశ్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్‌ కోచ్‌లు కరంవీర్‌ సింగ్‌, రాకేశ్‌లను కూడా నాడా సస్పెండ్‌ చేసింది. అదే విధంగా.. డోపింగ్‌ టెస్టుకు నిరాకరించిన ఏడుగురు అథ్లెట్లపై కూడా నాడా వేటు వేసింది. వీరిలో పారస్‌ సింఘాల్‌, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్‌, చెలిమి ప్రత్యూష, శుభం మహారా, కిరన్‌, జ్యోతి ఉన్నట్లు సమాచారం.

నేను ఏ తప్పూ చేయలేదు
నాడా సస్పెన్షన్‌ వేటు నేపథ్యంలో నాగపురి రమేశ్‌ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే తన జీవితం ధారబోశానని ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు