Breaking News

Ranji Trophy 2024: గెలుపు దిశగా ఆంధ్ర జట్టు..

Published on Mon, 01/22/2024 - 07:04

డిబ్రూఘర్‌: రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర మొదటి విజయం దిశగా సాగుతోంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం ఓటమికి చేరువైంది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అస్సాం మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (48 నాటౌట్‌) పోరాడుతుండగా...చేతిలో ఉన్న ఐదు వికెట్లతో అస్సాం మరో 282 పరుగులు చేయాల్సి ఉంది.

ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్‌ రెడ్డి 3, లలిత్‌ మోహన్‌ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 147/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (187 బంతుల్లో 125; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం పూర్తి చేసుకోగా, హనుమ విహారి (63) అర్ధసెంచరీ సాధించాడు. షేక్‌ రషీద్‌ (40 నాటౌట్‌) కూడా రాణించగా... అస్సాం బౌలర్లలో సిద్ధార్థ్‌ వాసుదేవ్‌ 5 వికెట్లు తీశాడు.
చదవండి: SA20 2024: సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)