Breaking News

మీరాబాయి చాను విఫలం.. ఆరో స్థానానికి పరిమితం

Published on Sat, 05/06/2023 - 11:02

జింజూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ మణిపూర్‌ లిఫ్టర్‌ శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగంలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మీరాబాయి మొత్తం 194 కేజీలు బరువెత్తింది.

ఆమె స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మీరాబాయి చివరి రెండు ప్రయత్నాల నుంచి వైదొలిగింది. మీరాబాయి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 207 కేజీలుకాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె 13 కేజీలు తక్కువ ఎత్తింది. జియాంగ్‌ హుయిహువా (చైనా; 207 కేజీలు) స్వర్ణం... హు జిహుయ్‌ (చైనా; 204 కేజీలు) రజతం... సెరోద్‌ చనా (థాయ్‌లాండ్‌; 200 కేజీలు) కాంస్య పతకం సాధించారు.    

సౌరవ్‌ శుభారంభం
షికాగో: ప్రపంచ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో భారత ప్లేయర్‌ సౌరవ్‌ ఘోషాల్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో సౌరవ్‌ 5–11, 11–6, 11–13, 11–6, 11–3తో యాయా ఎల్నావాస్నీ (ఈజిప్ట్‌)పై గెలిచాడు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)