Breaking News

భారత సాఫ్ట్‌బాల్‌ జట్టులో తెలంగాణ అమ్మాయి

Published on Tue, 07/25/2023 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేయనున్న సాఫ్ట్‌బాల్‌ క్రీడాంశంలో పాల్గొనే భారత మహిళల సాఫ్ట్‌బాల్‌ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది.

అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్‌’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్‌ బాబు తెలిపారు. నిజామాబాద్‌ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్‌ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది.  ఆసియా చాంపియన్‌íÙప్‌లో భారత జట్టు రెగ్యులర్‌ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్‌ సంఘం భారత జట్టుకు వైల్డ్‌ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడలు
సెపె్టంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)