Breaking News

భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

Published on Fri, 10/30/2026 - 21:21

హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2026లో భారత్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం జలంధర్ వేదికగా జపాన్‌తో జరిగిన ప్రిలిమినరీ రౌండ్ మూడో మ్యాచ్‌లో భారత హాకీ జట్టు  4-1 తేడాతో ఘన విజయం సాధించింది.  . ఈ గెలుపుతో పూల్ పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.

మ్యాచ్ తొలి క్వార్టర్‌లోనే భారత్ బోణీ కొట్టింది. అద్భుతమైన టీమ్ మూవ్‌తో అభిషేక్ నైన్ తొలి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే తొలి క్వార్టర్ ఆఖరి క్షణాల్లో జపాన్ జట్టుకు తమ లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచి 1-1తో స్కోరును సమం చేసింది.

ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో ఇరు జట్ల డిఫెండర్లు గట్టి పోటీనివ్వడంతో స్కోరు సమంగా కొనసాగింది. చివరి క్వార్టర్‌కు ముందు రెండు జట్లు 1-1తో నిలవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే నాలుగో క్వార్టర్ (చివరి 15 నిమిషాల్లో) భారత ఆటగాళ్లు విజృంభించారు. 

కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్ లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి టీమిండియాను మళ్లీ ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ వెంటనే అభిషేక్ నైన్ తన వ్యక్తిగత రెండో గోల్‌ను సాధించగా, విష్ణుకాంత్ సింగ్ నాలుగో గోల్ బాది భారత్‌ను విజేతగా నిలిపాడు. చివరి 15 నిమిషాల్లోనే ఏకంగా మూడు గోల్స్ సాధించిన భారత్, 4-1 తేడాతో జపాన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి అద్భుత విజయాన్ని అందుకుంది.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)