Breaking News

సింధుపైనే మరోసారి ఆశలు

Published on Tue, 04/08/2025 - 10:03

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ పోటీలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మ్యాచ్‌లుంటాయి. మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌ పీవీ సింధుపైనే భారత్‌ పతకావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

తొలి రౌండ్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్‌ ఎస్టెర్‌ వర్దోయో (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ఈ టోర్నీ చరిత్రలో సింధు రెండుసార్లు (2014, 2022) కాంస్య పతకాలు సాధించింది. భారత్‌కే చెందిన సైనా నెహా్వల్‌ అత్యధికంగా మూడు కాంస్య పతకాలు గెలిచింది. ఈసారీ సింధు కాంస్యం నెగ్గితే సైనా రికార్డును సమం చేస్తుంది. 

63 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌ నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్‌ చేరుకోలేకపోయారు. సింధుతోపాటు భారత్‌ తరఫున మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, అనుపమ, ఆకర్షి కశ్యప్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున లక్ష్య సేన్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్, కిరణ్‌ జార్జి బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం; మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)