Breaking News

ఐదుగురు స్పిన్నర్లా?

Published on Sun, 02/16/2025 - 03:38

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండటంపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎలా చూసినా ఈ సంఖ్య ఎక్కువేనని అతను అభిప్రాయ పడ్డాడు. పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో... టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా? అక్షర్‌ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌తో పాటు పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు తుది జట్టులో చోటు దక్కొచ్చు. 

వరుణ్‌ చక్రవర్తిని కూడా ఆడించాలనుకుంటే... ఒక పేస్‌ బౌలర్‌ను తగ్గించి పాండ్యానే రెండో పేసర్‌గా పరిగణించాల్సి ఉంటుంది. అదనపు పేసర్‌ను బరిలోకి దింపాలంటే ఒక స్పిన్నర్‌ను తగ్గించుకోక తప్పదు’ అని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్, జడేజా, కుల్దీప్, వరుణ్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అశ్విన్‌... టీమిండియాలో ‘సూపర్‌ స్టార్‌ కల్చర్‌’పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘భారత జట్టులో సూపర్‌ సెలబ్రిటీ విధానాన్ని తగ్గించాలి. దాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. జట్టులో ఉండేది ఆటగాళ్లే... సూపర్‌ స్టార్లు కాదు. కెరీర్‌లో ఎంతో సాధించిన కోహ్లి, రోహిత్‌ ఇప్పుడు మరో సెంచరీ కొట్టినా అదేమీ పెద్ద ఘనత కాదు, మీ వ్యక్తిగత రికార్డు కూడా కాదు. అంతా జట్టు కోసమే’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. ప్లేయర్లు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆడాలని అశ్విన్‌ సూచించాడు. 

జాతీయ జట్టు తరఫున 106 టెస్టులాడి 537 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌... 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 65 టి20ల్లో 72 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భాగంగా మూడో టెస్టు అనంతరం అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)