Breaking News

అశ్విని–తనీషాలకు డబుల్స్‌ టైటిల్‌

Published on Mon, 12/09/2024 - 04:15

గువాహటి: సొంతగడ్డపై జరిగిన గువాహటి మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో చివరిరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మూడు విభాగాల్లో భారత ప్లేయర్లు ఫైనల్‌ చేరుకోగా... రెండు విభాగాల్లో టైటిల్స్‌ లభించాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం టైటిల్‌ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్‌ కరుణాకరన్‌ విజేతగా అవతరించాడు. 

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ ఖరబ్‌ తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో సతీశ్‌ 21–17, 21–14తో చైనీస్‌ క్వాలిఫయర్‌ జు జువన్‌ చెన్‌పై అలవోకగా గెలిచాడు. 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి విజేతగా నిలిచాడు. సతీశ్‌కు 7500 డాలర్ల (రూ. 6 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

మహిళల డబుల్స్‌ టైటిల్‌ పోరులో ప్రపంచ 16వ ర్యాంక్‌ జోడీ అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్‌) ద్వయం 21–18, 21–12తో లి హువా జౌ–వాంగ్‌ జి మెంగ్‌ (చైనా) జంటను కంగుతినిపించింది. తొలి గేమ్‌లో చైనా జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ... రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అశ్విని–తనీషా 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు. 

అశ్విని–తనీషా జోడీకి 7900 డాలర్ల (రూ. 6 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అన్‌మోల్‌ 21–14, 13–21, 19–21తో కాయ్‌ యన్‌ యన్‌ (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకున్న భారత షట్లర్‌కు రెండో గేమ్‌ నుంచి సవాల్‌ ఎదురైంది. 

చైనా క్రీడాకారిణి పుంజుకొని రెండో గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడోగేమ్‌ హోరాహోరీగా జరిగింది. ఇద్దరు ప్రతీ పాయింట్‌ కోసం దీటుగా పోరాడారు. అయితే కీలకదశలో చైనీస్‌ ప్లేయర్‌ పాయింట్లు నెగ్గి విన్నర్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నరప్‌ అన్‌మోల్‌కు 3800 డాలర్ల (రూ. 3 లక్షల 21 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4680 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)