Breaking News

గుజ‌రాత్ టైటాన్స్ కీల‌క నిర్ణ‌యం.. ఆశిష్ నెహ్రాపై వేటు!

Published on Sat, 08/10/2024 - 11:14

ఐపీఎల్‌-2025కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాట్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.

త‌మ జ‌ట్టు హెడ్‍కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  మూడు సంవత్సరాల ఆశిష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. 

ఈ ఏడాది చివరలో జరగనున్న మెగా వేలానికి ముందు గుజరాత్‌ ఫ్రాంచైజీ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా గుజరాత్‌ హెడ్‌కోచ్‌గా నెహ్రా విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. తమ అరంగేట్ర సీజన్‌లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన నెహ్రా.. తర్వాతి సీజన్‌లో జీటీ రన్నరప్‌ నిలిచింది.

అయితే ఐపీఎల్‌ 2024లో మాత్రం గుజరాత్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో గుజరాత్‌ విఫలమైంది. అందుకు కెప్టెన్సీ మార్పు కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఏడాది సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ ట్రేడ్‌ చేసు​కోవడంతో గుజరాత్‌ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ ఎంపికయ్యాడు. కానీ జట్టును నడిపించడంలో శుబ్‌మన్‌ ఎంపికయ్యాడు.

ఇక గత మూడు సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించిన గ్యారీ కిరెస్టన్‌ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా గ్యారీ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు గుజరాత్‌ యాజ‌మాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్‌ యాజ‌మాన్యం సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుంచి కొంత వాటాను భార‌త వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కొనుగోలు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్‌పై అధికారికంగా ప్రకటన విడుదల కానుందని క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు