Breaking News

మూడోసారి టైటిల్‌... సబలెంకా ప్రైజ్‌మనీ ఎంతంటే?

Published on Mon, 05/05/2025 - 16:43

మాడ్రిడ్‌: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్‌ అరీనా సబలెంకా (Aryna Sabalenka- బెలారస్‌) మూడో సింగిల్స్‌ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకుంది. మాడ్రిడ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 సిరీస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ సబలెంకా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. 

అమెరికా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ (Coco Gauff)తో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సబలెంకా 6–3, 7–6 (7/3)తో విజయాన్ని అందుకొని మూడోసారి మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ను దక్కించుకుంది. 2023, 2021లలో కూడా సబలెంకా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది.

ఈ క్రమంలో పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) తర్వాత మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ను మూడుసార్లు గెలిచిన రెండో ప్లేయర్‌గా సబలెంకా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా సబలెంకా కెరీర్‌లో ఇది 19వ టైటిల్‌కాగా, ఈ ఏడాది మూడోది. 

ఈ సంవత్సరం ఆమె బ్రిస్బేన్‌ ఓపెన్, మయామి ఓపెన్‌లలో విజేతగా నిలిచింది. కోకో గాఫ్‌తో 1 గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

రూ. 9 కోట్ల 40 లక్షలు
తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన బెలారస్‌ స్టార్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 142 పాయింట్లకుగాను సబలెంకా 81 పాయింట్లు, కోకో గాఫ్‌ 61 పాయింట్లు గెలిచారు. విజేతగా నిలిచిన సబలెంకాకు 9,85,030 యూరోల (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. రన్నరప్‌ కోకో గాఫ్‌కు 5,23,870 (రూ. 5 కోట్లు) యూరోల ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.  

ఒసాకా ఖాతాలో టైటిల్‌  
­మాలో (ఫ్రాన్స్‌): నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నయోమి ఒసాకా (Naomi Osaka) డబ్ల్యూటీఏ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన ఎల్‌ ఓపెన్‌ 35 డబ్ల్యూటీఏ–125 టోరీ్నలో ఒసాకా విజేతగా నిలిచింది. 2021 ఆ్రస్టేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ తర్వాత ఒసాకాకు ఇదే తొలి టైటిల్‌ కావడం విశేషం. ఫైనల్లో ఒసాకా 6–1, 7–5తో కాజా జువాన్‌ (స్లొవేనియా)పై విజయం సాధించింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రెండో సీడ్‌ ఒసాకా... ఒక ఏస్‌ కొట్టి 6 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 6 బ్రేక్‌ పాయింట్లు కాచుకున్న ఈ మాజీ ప్రపంచ నంబర్‌వన్‌... ఓవరాల్‌గా 70 పాయింట్లు సాధించింది. 2023 జూలైలో పాపకు జన్మనిచ్చిన ఒసాకా ఆ తర్వాత నెగ్గిన తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ ఇదే. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న 27 ఏళ్ల ఒసాక ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌లో పరాజయం పాలైంది.   

చదవండి: కెప్టెన్‌గానే కాదు.. వైస్‌ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్‌!.. రేసులో మూడు పేర్లు..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)